కరోనాతో మాదాపూర్ డీఎస్ఐ మృతి

6
Madapoor SI Passed away with corona
Madapoor SI Passed away with corona

Madapoor SI Passed away with corona

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కరోనాపై పోరులో ముందున్న పోలీసులపై తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి వైద్యులు, పోలీసు అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ (డిటెక్టివ్ సబ్ ఇన్స్ పెక్టర్) డీఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీస్‌ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే వైరస్‌ బారినపడి డాక్టర్లు, పోలీసులు మృత్యువాత పడుతున్నారు. ఉన్నతాధికారులతో పాటు, పోలీసులు, హోంగార్డులు కరోనా బారిన పడి చనిపోయారు.