మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే

Mahesh as Sri Rama

మహా భారతం తీయడం అనేది నా డ్రీమ్ అని రాజమౌళి ఎప్పుడూ చెబుతుంటాడు. కానీ ఈ పోస్టర్ చూస్తే అతని డ్రీమ్ రామాయణం వైపు మళ్లుతుంది అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో తయారు చేశారు కొందరు అభిమానులు. హిందీలో వచ్చే రామాయణ్ లోని శ్రీరాముడి నటుడి ఫోటోను మార్ఫ్ చేసి మహేష్ ను ఆ ప్లేస్ లో పెట్టారు. కావడానికి ఇది ఫ్యాన్ మేడ్ అయినా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. అస్సలు ఆ పాత్రలో తెలుగులో ఈ తరంలో ఇంకెవరు చేసినా కుదరదు అనేలా ఉందీ పోస్టర్ అంటే అతిశయోక్తి కాదు. నిజంగా ఇది మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ చూడగానే నచ్చేలా డిజైన్ చేశారు. మైథాలజీ కథలు అందరికీ సూట్ కావు. కానీ కొందరికి మాత్రం అతికినట్టుగా సరిపోతుంది. అలాంటి గెస్చర్ లోనే ఉంది మహేష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్. చాలాకాలంగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా అది ఓ రూపానికి వచ్చింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ బాబుతోనే అని ఆల్రెడీ కన్ఫార్మ్ చేశారు. కాకపోతే అది మైథాలజీ అని ఎవరూ అనుకోలేదు. బట్.. ఈ స్టిల్ చూసిన తర్వాత ఏవైనా ఆలోచనలు మారితే.. మళ్లీ ఇది కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఓ అద్భుతం అవుతుంది. మొత్తంగా మహేష్ బాబు ఫ్యాన్ మేడ్ రాముడి పోస్టర్ టాలీవుడ్ లో ఓ సంచలనం సృష్టిస్తోంది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఇదో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మొత్తంగా మహేష్ బాబు రాముడి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *