మహేష్ కు జగనన్న విద్యాదీవెన

Mahesh Babu gets Jagananna Vidya Deevena card

సూపర్ స్టార్ మహేష్ బాబుకు, జగనన్న విద్యాదీవెన పథకం కార్డు వచ్చింది . ఈ విచిత్రం కర్నూలు జిల్లాలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లలో విద్యాదీవెన పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఫోటో ఉండాల్సిన ప్లేస్‌లో మహేష్ బాబు ఫోటో దర్శనం ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది . ఇక ఇది చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యమంటూ చర్చించుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మిగనూరులోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీకి చెందిన లక్ష్మి కూడా ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంది. లోకేశ్‌కు కార్డు వచ్చింది కానీ లక్ష్మికి రాలేదు. అయితే లక్ష్మి కార్డుపై ఆమె ఫోటోకు బదులు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫోటో ఉంది. ఇక ఈ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.కాగా ఆ విషయం లక్ష్మి తల్లిదండ్రులకు తెలిసి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మి ఫోటోకు బదులు మహేశ్‌బాబు ఫోటో ఎందుకు వచ్చిందన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సచివాలయ ఉద్యోగుల తప్పిదమే కానీ ఇందులో తమ పొరపాటేమీ లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Mahesh Babu gets Jagananna Vidya Deevena card,mahesh babu, jagananna vidya deevena , kurnool , photo, welfare scheme , emmiganur , siddhartha degree college , lakshmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *