మ‌హేష్‌… మురిసిన వేళ‌

Mahesh  Merisina Vela
మ‌హేష ఆనందానికి అవ‌ధుల్లేవు. `ఇంత టాలెంటా?` అని ఆశ్చ‌ర్య‌పోతున్నారాయ‌న‌. ఇంత‌కీ ఎవ‌రిని చూసి.. ఎందుకు అంత ఆశ్చ‌ర్యం అని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ముద్దుల త‌న‌య సితార‌పాప చేసిన డ్యాన్సులు చూసి మ‌హేష్ మురిసిపోయారు. వాళ్లింట్లో ఉన్న జిమ్ లో సితార ఓ పాట‌కు డ్యాన్స్ చేసింది. `క‌న్నా నిదురించరా`.. అని కీర‌వాణి సంగీతంలో బాహుబ‌లి2లో వ‌చ్చిన పాట అది. ఆ పాట‌లో సినిమాలో అనుష్క నృత్యం చేశారు. అనుష్క‌ను అనుక‌రిస్తూ చిన్నారి సితార కూడా నృత్యం చేసింది. ఆ వీడియో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం త‌న `మ‌హ‌ర్షి` సినిమాతో బిజీగా ఉన్నారు మ‌హేష్ . మ‌ధ్య‌లో హాలీడే తీసుకున్నారు. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా పిల్ల‌ల‌తో విదేశాల‌కు వెళ్లే మ‌హేష్ కుటుంబం ప‌ట్ల ఎంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారో అభిమానుల‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. పిల్ల‌లంటే మ‌హేష్‌కి చాలా ఇష్టం. వీలైనంత స‌మ‌యాన్ని వారితోనే గ‌డుపుతుంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *