మహేష్ కొత్త సినిమా షురూ

maheshbabu new movie

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం ప్రిన్స్ 29వ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నది. దీనికి దర్శకుడెవరో తెలుసా? పరశురాం ఈ సిినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా ట్వీట్ (https://twitter.com/DirParasuram) చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ ను ఎక్కడా లీక్ చేయలేదు. ఆదివారం ఉదయమే మూవీ టైటిల్ ను వెల్లడిస్తామని దర్శకుడు ప్రకటించారు. ఏదీఏమైనా లాక్ డౌన్ వల్ల దాదాపు మూడు నెలల్నుంచి కొత్త సిినిమాల ప్రకటనలు లేని సమయంలో సూపర్ స్టార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటంతో ప్రిన్స్ అభిమానుల్లో ఎక్కడ్లేని ఆనందం నెలకొన్నది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సిినిమాకు నిర్మిస్తున్నది.

#maheshbabu29thmovie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *