మాస్కు లేని మహమూద్ అలీ..

Mahmood Ali Without Mask

33
Mahmood Ali Without Mask
Mahmood Ali Without Mask

Mahmood Ali Without Mask

ఈ ఫోటోను ఒకసారి క్షుణ్నంగా గమనించండి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత అంతటి పెద్ద వ్యక్తి.. రాష్ట్రానికే హోం మంత్రి. మైనార్టీలకు పెద్ద దిక్కు. మరి, ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అసలే తెలంగాణలో తాజాగా 2400 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో ఫాల్గొన్న మంత్రివర్యులు అసలు మాస్కే పెట్టుకోలేదు. పక్కన కూర్చున్న మరో యువ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కు కూడా మాస్కు లేదు. కానీ, మంత్రి వెనకాల నిల్చున్న గార్డు మాత్రం విధిగా మాస్కు పెట్టుకున్నాడు. అంటే, కరోనాకు మహమూద్ అలీ చుట్టమా? పట్టమా? కరోనా రాకుండా ఉండటానికి. అసలే నాగార్జున సాగర్ లో ప్రజలు పాల్గొనేందుకు రావడం లేదని, ఒక్కొక్కరికీ రూ.200 ఇచ్చి మరీ రప్పించుకుంటున్నారు. పైగా, కరోనా నేపథ్యంలో మాస్ గ్యాథరింగ్ ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయినా, మన మంత్రివర్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఇలా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే, సామాన్యులేం పాటిస్తారు? మరి, వీరి నుంచి ప్రభుత్వం జరిమానా ఎందుకు వసూలు చేయకూడదు. కోర్టులో కేసు ఎందుకు నమోదు చేయకూడదు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here