మలేసియా రాజు రాజీనామా

Spread the love

Malaysian King Resigning his position

· పదవీకాలానికి ముందే సింహాసనం వదులుకున్న సుల్తాన్ మహమ్మద్

· రాజీనామాకు కారణాలు వెల్లడించి రాజభవనం

మలేసియా రాజు సుల్తాన్ మహమ్మద్-5 తన పదవికి రాజీనామా చేశారు. రష్యా మాజీ సుందరిని ఆయన పెళ్లి చేసుకున్నట్టు గత కొంత కాలంగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గత కొంత కాలంగా తన విధులకు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతోనే రాజు తన విధులకు దూరంగా ఉంటున్నట్టు చెప్పినప్పటికీ, అసలు కారణం మాత్రం ఆయన రష్యా మాజీ సుందరిని వివాహం చేసుకోవడమేనని వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికార వివరణా ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలో రాజు భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. మలేసియా 15వ రాజు సుల్తాన్ మహమ్మద్-5 తన పదవికి రాజీనామా చేశారని, అది ఈనెల 6వ తేదీ ఆదివారం నుంచే అమల్లోకి వస్తుందని రాజభవనం ప్రకటన విడుదల చేసింది. పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా సుల్తాన్ మహమ్మద్ చరిత్రకెక్కారు. ఆయన రెండేళ్ల క్రితమే రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా, రాజు రాజీనామాకు కారణమేంటో రాజభవనం చెప్పలేదు. రష్యా మాజీ సుందరిని ఆయన వివాహం చేసుకున్నారన్న వార్తలపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. 1957లో బ్రటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మలేసియా చరిత్రలో ఇలా ఓ రాజు పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ముస్లిం మెజార్టీ దేశమైన మలేసియాలో ప్రతి ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది. ఆ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పాలకులు ప్రతి ఐదేళ్లకూ దేశ పగ్గాలు చేపడుతుంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *