హైదరాబాద్లో ప్రథమ ప్రైవేటు వర్సిటీ

MallaReddy University Brochure

సమాజంలో ప్రస్తుత యువతరానికి (యంగ్ జనరేషన్ ) తగ్గట్లుగా మరిన్ని యూనివర్సిటీల అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శివారులోని మైసమ్మగూడలో ప్రైవేట్ రంగంలోని తొలి యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ లోగో, బ్రోచర్, వెబ్ సైట్ ల ఆవిష్కరణ కార్యక్రమంలో బుధవారం మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి, జేఎన్టీయూ ఇంచార్జీ వీసీ జయేష్ రంజన్, టీఆర్ఎస్ మల్కాజిగిరి లోక్ సభా ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి లతో కలిసి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రానున్న భవిష్యత్ యువ తరానిదేనని అన్నారు. దేశంలోని 130 కోట్ల జనాభాలో 65 శాతం 35 ఏళ్ల వయస్సు ఉన్న వారిదేనని అన్నారు. శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక కోర్సులను బోధించాలని వినోద్ కుమార్ సూచించారు. కృత్రిమ మేధోశక్తి (ఏ.ఐ), మిషన్ లర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్, డేటా అనలాటిక్స్, లిబరల్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, అన్ని కాలాల్లో డిమాండ్ ఉన్న ఎకనామిక్స్ కోర్సులను తొలుత దృష్టి పెట్టుకోవాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఐదు యూనివర్సిటీలను ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని, భవిష్యత్ లో మరిన్ని యూనివర్సిటీల ఏర్పాటుకు ఆస్కారం ఉందని వినోద్ కుమార్ వివరించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ పరిపాలన భవనం క్యాంపస్ లో యూనివర్సిటీ లోగో, బ్రోచర్ , వెబ్సైట్ లను ఆవిష్కరించారు. అంతకు ముందు క్యాంపస్ లో వినోద్ కుమార్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ డీ. ఎన్. రెడ్డి, వైస్ ఛాన్సలర్ వీ.ఎస్. కే. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MallaReddy University

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *