దేశంలో దుర్యోధన , దుశ్శాసనుల పాలన అన్న మమతా బెనర్జీ

Mamata Banerjee, the governor of Duryodhana and Dasanas in the country

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత ర్యాలీకి కొన్ని గంటల ముందు ప్రధాని ఇదే లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

ఆ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉందని, బొగ్గు గనులకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం రక్షణ కల్పిస్తోందని ఆమె చెప్పారు. వాస్తవానికి అక్రమ బొగ్గు వ్యాపారం చేస్తోంది బీజేపీ నేతలేనని ఆమె ఆరోపించారు. తన దగ్గర ఓ పెన్‌ డ్రైవ్‌ ఉందని, అందులో అనేక వివరాలు ఉన్నాయని మమత చెప్పారు. దాన్ని బహిరంగపరిస్తే పశువుల స్మగ్లింగ్‌, బొగ్గు మాఫియా గురించి అనేక రహస్యాలు బట్టబయలవుతాయన్నారు.

ఈ సందర్భంగా మోడీకి మమత బంపరాఫర్ ఇచ్చారు.ప్రధాని తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటామని,ఆరోపణలను నిరూపించలేకపోతే చెవులు పట్టుకుని మోడీ 100 గుంజీలు తీస్తారా? అంటూ మమత సవాల్‌ చేశారు.దేశాన్ని ప్రస్తుతం దుర్యోధనుడు, దుశ్శాసనుడు పాలిస్తున్నారని పరోక్షంగా మోడీని, బీజేపీ చీఫ్ అమిత్‌ షాను ఉద్దేశించి ఆమె విమర్శించారు. శారదా కుంభకోణంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ప్రమేయం రుజువు కాలేదని మమత అన్నారు. తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడరాదని మోడీని ఆమె హెచ్చరించారు.తాను చేసిన చెంపదెబ్బ వ్యాఖ్యలను ప్రధాని వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *