మంగపేట విషాదం.. వాగు దాటినా దక్కని ప్రాణం  

Spread the love
MANGAPET TRAGEDY

ములుగు జిల్లా మంగపేటలో విషాదం  చోటు చేసుకుంది. వర్షాల కారణంగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగులు పొంగటంతో వూరు దాటలేని స్థితిలో వారం రోజులు జ్వరంతో బాధపడ్డ నాగయ్య అనే వ్యక్తి  గ్రామంలోని యువత వాగు దాటించి ఆస్పత్రికి తీసుకొచ్చినా బ్రతకలేదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మంగపేటకు వెళ్లే అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. నాగయ్య అనే వ్యక్తి వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్లు చేతులేత్తేశారు. చికిత్స కోసం గ్రామం దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు సౌకర్యం లేని కారణంగా 108 అక్కడకు చేరుకోలేకపోయింది. ఈ తరుణంలో నలుగురు యువకులు ప్రాణాలకు తెగించి వాగులో నాగయ్యను తమ చేతులపై ఎత్తుకొని వాగును దాటారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే నాగయ్య మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

TELANGANA HEART TOUCHING STORIES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *