కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల

22
Maoists Released Rakesh Singh
Maoists Released Rakesh Singh

Maoists Released Rakesh Singh

ఎట్ట‌కేల‌కు మావోయిస్టులు కోబ్రా క‌మాండో రాకేశ్వ‌ర్ సింగ్ ను విడుద‌ల చేశారు. దీంతో, గత కొన్ని గంట‌ల నుంచి నెల‌కొన్న టెన్ష‌న్ త‌గ్గుముఖం ప‌ట్టింది. మావోయిస్టులు రాకేశ్వ‌ర్ సింగ్ ను స‌జీవంగా వ‌దిలివేస్తారా? లేక చంపేస్తారా? అనే టెన్ష‌న్ ఏర్ప‌డింది. కానీ, స్థానిక బ‌స్త‌ర్ విలేక‌రులు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించి కమాండర్ ను క్షేమంగా తీసుకొచ్చారు. దీంతో, పోలీసు వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించిన వారిలో ప‌ద్మ‌శ్రీ ధ‌ర్మ‌పాల్ సైనీ, గోండ్వానా స‌మాజ్ అధ్య‌క్షుడు టి. బోర‌య్య త‌దిత‌రులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అట‌వీ ప్రాంతంలో ప్ర‌జా కోర్టు ను నిర్వ‌హించి ఆయ‌న్ని విడుద‌ల చేసిన‌ట్లు విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Telangana Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here