రేప్ చెయ్..పెళ్లి చేసుకో…

Marry Your Rapist Law In Turkey

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యాచారాలు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. చ‌ట్టాల తీరు అంతంత‌మాత్ర‌మే ఉండ‌టంతో రేపిస్టులు య‌దేచ్ఛ‌గా చెల‌రేగిపోతున్నారు. మేమం చేసినా చెత్తుతుంద‌నుకుంటున్నారు. ఇక ప్ర‌జ‌లేమో ఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడ్రోజులు రోడ్ల‌పైకొచ్చి మ‌రునాడే మ‌ర్చిపోతున్నార‌. ఇదంతా ఒక్క‌సారి గ‌మ‌నిస్తే ఆడ‌పిల్ల‌కు స‌మాజంలో భ‌ద్ర‌త లేద‌న్న‌ది స్ప‌ష్టం. మ‌రి ఇందుకుగానూ చ‌ట్టాలేం చేయ‌లేవా అంటే చెయ్య‌లేవు, చెయ్యావు కూడా. ఎందుకంటే చ‌ట్టాల‌ను త‌మ అదుపులో ఉంచుకుని త‌మ స్వార్ధం కోసం వాడుకునేవారు రాజ‌కీయ నాయ‌కులు. ఇక స‌మాజ‌మేమ్ మారుతుంది. మార‌దు గాక మార‌దు. అయితే ట‌ర్కీ ప్ర‌భుత్వం ఓ భ‌యంక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడా నిర్ణ‌యానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అడ్డుచెప్తున్నాయి. అస‌లింత‌కీ ట‌ర్కీ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటంటే…అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే శిక్ష నుంచి మినహాయింపు ఇస్తామంటోంది టర్కీ ప్రభుత్వం.

పైన పేర్కొన్న ట‌ర్కీ వారి నిర్ణ‌యం ఎంత హేయ‌మైంది చెప్పండి. అంటే చిన్న పాప‌ను రేప్ చేసి నేను త‌న‌ను పెళ్లి చేసుకుంటా అంటే పాప‌కు న్యాయం జ‌రిగిన‌ట్టేనా..ఇష్ట‌మొచ్చిన‌ట్లు రేపులు చేయ‌డం తాళి క‌ట్ట‌డం ఇదేనా రేపిస్టుల‌కు వేసే శిక్ష‌. అంటే రేప్ చేసిన వాడితో బాధితురాలు జీవిత‌కాలం భ‌ద్ర‌త‌గా ఉంటుందా. అస‌లు రేపిస్తులు అంటేనే మాన‌వ‌మ్రుగాలు. మ‌రి వాళ్ల‌తో బాధితురాలికి పెళ్లి చేస్తే ఎలా..అదే ఇప్పుడు ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణ‌యం చెత్త నిర్ణ‌యం అంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఇక ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ట‌ర్కీ నిర్ణ‌యాన్ని ఖండిస్తుంది. మ్యారీ యువర్‌ రేపిస్ట్‌ బిల్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బిల్లును ఈ నెలాఖరులో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేగాక బాల్య వివాహాలు ఎక్కువవుతాయని, పిల్లలపై రేప్‌లు మరింత పెరగుతాయని చెప్తున్నారు. మ‌రోవైపు ఇష్టం లేకున్నా బాధితురాలు అత్యాచారం చేసిన వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ ప్ర‌జాసంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Marry Your Rapist Law In Turkey,Turkey New Law On Rapist,What About Marry Your Rapist Law,marry their victims,No Case On Rapists In Turkey,Positive Acts On Rapist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *