మారుతీరావు ఆత్మహత్యపై సోదరుడు శ్రవణ్‌..

Maruti Rao Family Comments After Suicide

ప్రణయ్ హత్య కేసు నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మృతి చెందారు. ఇక ఆయన ఆత్మహత్యకు పాల్పాదారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్తున్న నేపధ్యంలో ఆత్మహత్యతో ఖంగుతిన్నారు కుటుంబ సభ్యులు. ఇక ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారని, అందులో పలు అంశాలు ప్రస్తావించారని కూడా తెలుస్తుంది. పశ్చాతాప్తంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని  కూతురు అమృత స్పందిస్తే, పోలీసుల ఒత్తిడితో చనిపోయారని ఆయన భార్య ఆరోపించారు. తీవ్ర మానసిక ఒత్తిడి  కారణంగానే ఆత్మహత్య  చేసుకుని ఉండొచ్చని సోదరుడు  భావిస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యపై అతని కూతురు అమృత స్పందించింది. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటో  తెలియాల్సి ఉందన్నది. బహుశా ప్రణయ్ ను చంపిన  పశ్చాతాప్తంతోనే చనిపోయి ఉండొచ్చని కామెంట్ చేసింది. అయితే ఆత్మహత్య గురించి తెలుసుకున్న మారుతీరావు  భార్య  ఆమె తరపు బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి  చేరుకున్నారు.

భర్త మృతదేహాన్ని చూసి భార్య గిరిజ కుప్పకూలిపోయారు. చేతులతో గుండెలు బాదుకుంటూ  ఆమె రోదించిన తీరు అందర్నీ కలచి వేసింది. భర్త శవం వద్ద ఆమె ఏడుస్తూ కింద పడిపోయింది. అయితే తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మారుతీరావు సోదరుడు శ్రవణ్ చెబుతున్నారు. గత ఏప్రిల్  నుంచి మాటాల్లేవని చెప్పుకొచ్చాడు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య  చేసుకుని ఉండొచ్చని సోదరుడు శ్రవణ్‌ చెబుతున్నారు. పోస్ట్ మార్టమ్ తర్వాత మారుతీరావు మృతదేహాన్ని  సొంతూరు మిర్యాలగుడాకు తరలించారు. అక్కడే  అంత్యక్రియలు చేయనున్నారు.

Maruti Rao Family Comments After Suicide,miryalaguda, maruthi rao, suicide, suspecious death , hyderabad , osmania hospital , pranay murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *