Mayank set the record as a judge
దేశంలోనే అతి పిన్న వయసులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా మయాంక్ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన మయాంక్ అతి చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను నిర్వర్తించ బోతున్నాడు. రోజు 13 గంటలు చదివి, కష్టపడితే ఫలితం దానికదే వస్తుందని నిరూపించాడు మయాంక్ ప్రతాప్. ఇక మంచి న్యాయమూర్తి కావాలంటే దయాగుణం ఉండాలని ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సేవలందించాలని మయాంక్ తెలిపారు. ఇక అతనిలో ఉన్న ఆ తపనే 21 సంవత్సరాలకే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేలా చేసింది. జైపూర్ లోని మాన్ సరోవర్ కు చెందిన 21ఏళ్ల మయాంక్ ప్రతాప్ న్యాయమూర్తిగా భాధ్యతలు చేపట్టి.. దేశంలో, అతి తక్కువ వయసులోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్ ఎల్ బీ డిగ్రీని పూర్తి చేసిన మయాంక్ అనంతరం జరిగిన రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమేకాక, టాపర్ గా నిలిచాడు. గతంలో ఈ పరీక్షకు అర్హత వయసు 23 ఏళ్లుగా ఉండేది. ఈ ఏడాది అర్హత వయసును 21ఏళ్లకు తగ్గించడంతో మయాంక్ కు ఆర్ జేఎస్ రాయడానికి వీలు కలిగింది. దీంతో ఆ చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మయాంక్ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
tags : mayank pratap, judge, rajasthan, ashok gehlat, rjs exam,