కరోనాపై పోరాటానికి మెఘా 5 కోట్ల విరాళం

Megha Engineering 5 CR Donation

కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని అతలాకుతులం చేస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  దేశ వ్యాప్తంగా వైద్యులు, పోలీసులు , మీడియా, సానిటేషన్ సిబ్బంది కష్టపడుతున్నారు.  ప్రపంచాన్ని కబళించేందుకు తరుముకొస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. కరోనాపై వైద్య సేవలు అందించే వారి కోసం ,అలాగే  దినసరి కూలీల బాగోగుల కోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ (మెయిల్) ముందుకొచ్చింది. అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళంగా ఇచ్చింది.

లాక్ డౌన్ తో పనిలేక ఆకలితో అల్లాడుతున్న పేదలతోపాటు కోవిడ్ మహమ్మారి తరిమివేయడానికి 24 గంటలు పనిచేస్తున్న పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, మీడియా వాళ్లకు హైదరాబాద్ లో భోజన సదుపాయం కల్పించడానికి సిద్ధమైంది. అంతే కాకుండా కరోనా వైరస్ బారినపడిన వారికి చేయూతగా మెడిసన్స్, భోజనం, మెడికల్ ట్రాన్స్  పోర్టేషన్ ఇస్తోంది. తాజాగా మేఘా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను  కలిశారు. తయారు చేసిన పౌష్టికరమైన 4వేలకు పైగా ఫుడ్ ప్యాకేట్లను అందజేయనున్నారు. . రేపటి నుంచి మూడు పూటలా భోజనం సరఫరా చేస్తారు. క్షేత్ర స్థాయిలో ఇప్పుడు పోలీసులు మాత్రమే ఉండడం.. వారికే ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఈ ఫుడ్ ప్యాకేట్లను కూడా మేఘా సంస్థ పోలీస్ శాఖకే అందజేసింది. ఇవి అసహాయులకు, వైద్య సిబ్బందికి పంపిణి చేయాలని కోరింది. ఇక తెలంగాణతోపాటు, ఏపీలోనూ ఇలా చేయాలని ‘మేఘా’ సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు ఏపీ పోలీసులకు వీటిని అందజేయాలని భావిస్తున్నారు.. పోలీసులు ఆహార కొరతతో బాధపడుతున్న వారికి వీటిని అందజేస్తారు.

tags: corona virus updates, corona pandemic live news, telangana cm relief fund, cm kcr, megha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *