మెహర్ రమేష్ కు మెగా షాక్

2
mehar ramesh in OTT
mehar ramesh in OTT

mehar ramesh in OTT

మెహర్ రమేష్.. భారీ చిత్రాలతో దర్శకుడుగా వచ్చాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో అంటూ అతను తీసినవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. విచిత్రంగా అవన్నీ భారీ ఫ్లాపులుగానూ నిలిచాయి. నిజం మాట్లాడితే అతని టేకింగ్ బానే ఉంటుంది. అందుకు కంత్రి, బిల్లా సినిమాలే( మరి ఈ టైమ్ లో అతని వద్ద ఎవరైనా టాలెంటెడ్ కో డైరెక్టర్ ఉన్నాడేమో చెప్పలేం) ఎగ్జాంపుల్. బట్ కథల ఎంపికలో తేడాలు అతన్ని భారీ డిజాస్టర్ల దర్శకుడుగా మార్చాయి. దీంతో మెహర్ రమేష్ పేరు వింటేనే టాలీవుడ్ ఉలిక్కి పడటం మొదలైంది. అయితే మెగా ఫ్యామిలీతో ఉన్న దూరపు చుట్టరికంతో ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉంటూ ఏదో రకంగా నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా అతనికి మెగా హీరోల నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అది కూడా  చరణ్ నిర్మాణ సంస్థలో దర్శకుడుగా అవకాశం. ఈ ఊహించని పరిణామానికి చాలామంది ఆశ్చర్యపోయారు.  అయితే లేటెస్ట్ గా ఈ మెహర్ కు అసలు విషయం తెలిసివచ్చిందట. రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ లో మెహర్ రమేష్ సినిమా చేయడం లేదు. యస్.. కానీ ఆ ఫ్యామిలీ నుంచి నిర్మాణమయ్యే ఓ ప్రోడక్ట్ డైరెక్ట్ చేస్తాడు.

అయితే ఇది కూడా సినిమా కాదు. వెబ్ సిరీస్. యస్.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయింది కదా. ఆమె నిర్మించే ఓ వెబ్ సిరీస్ ను అల్లు అరవింద్ ఆహా కోసం మెహర్ డైరెక్ట్ చేస్తాడన్నమాట. అయితే ఈ కథ విషయంలో చిరంజీవి పూర్తి బాధ్యతలు తీసుకుంటాడు. ఆయనకు నచ్చితేనే వెబ్ సిరీస్ అయినా ఓకే అయ్యేది. కాకపోతే ఇప్పటికే తన కథతో మెహర్.. మెగాస్టార్ ను మెప్పించాడు అంటున్నారు. అందువల్ల సుస్మిత నిర్మాతగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అల్లు అరవింద్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ సిరిస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడన్నమాట. పోనీలే.. అసలు సినిమాలే లేకుండా ఆ హీరో వెంటా ఈ హీరో వెంటా తిరిగే కంటే ఏదో ఒకటి చేసుకుంటూ యాక్షన్, కట్ చెప్పడం గౌరవం కదా..?

tollywood news