జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారన్న భట్టి

How will Merge central Party and State Party

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ లో ఎలా విలీనం చేస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్ట పగలే ఖూనీ చేస్తోందని అన్నారు. ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పార్టీ విలీనం అంటే సామాన్యమైన ప్రక్రియ కాదని భట్టి అన్నారు. గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఈసీకి పంపి, ఆ తర్వాత విలీనం చేయడం జరిగిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *