metro kathalu
పలాస 1978 తర్వాత దర్శకుడు కరుణ్ కుమార్ నుండి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘ మెట్రో కథలు’. ఖదిర్ బాబు రాసిన ఈ కథలు ఈ నెల 14న ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి.. ప్రతి నగరానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది.. ఆ నగరంలో జరిగే ఈ నాలుగు కథలు విభిన్నమైన అనుభూతులను పంచబోతున్నాయి. ఉమెన్ సెట్రిక్ గా సాగే ఈ కథలు తెలుగు లిటరేచర్ కు ఓటిటికి దారులు వేయబోతున్నాయి. తెలుగు సాహితీ ప్రపంచంలో చిరపరిచితుడైన ఖదిర్ బాబు అందించిన మెట్రో కథలనుండి మూడు కథలు… బియాండ్ కాఫీ నుండి ఒక కథను ఎంచుకొని ఓటిటి లో ఒక ఆంథాలజీని రూపొందించాడు కరుణ కుమార్. తెలుగు ఓటిటి పై ఇప్పటి వరకూ కనిపించని కొత్త కథలను రూపొందించాడు కరుణ కుమార్.. విమెన్ ఇష్యూస్ ని హైలెట్ చేసే కథలు ఈ విధంగా ప్రజెంట్ చేయడం తప్పకుండా కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.
తిరువీర్ నక్షత్ర జంటగా ‘ ప్రపోజల్’.. నందినీ రాయ్, రామ్ లతో ‘సెల్పీ’.. సనా, అలీరాజా లీడ్ రోల్స్ లో ‘ఘటన’.. రాజీవ్ కనకాల భార్గవి లీడ్ రోల్స్ లో ‘తేగలు’అనే నాలుగు కథలుగా రాబోతున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ ఇప్పుడు ఏజ్ బారియర్స్ ని దాటుతుంది.. టార్గెట్ ఆడియన్స్ కూడా నిదానంగా మారుతున్నారు.. మెట్రో కథలు ఈ విషయంలో ముందడుగు వేసింది… ఈ యేడాది మార్చ్ లో రిలీజ్ అయిన ‘పలాస1978’ విమర్శల ప్రశంసలు అందుకొంది… ఓటిటి లోనూ అద్భుతమైన స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలలో భిన్నమైనదిగా నిలిచింది. ఇక ఇప్పుడు ఆహా నుండి వచ్చిన ఆఫర్ ని అంగీకరించిన కరుణ కుమార్ మెట్రో కథలను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు.. కరుణ్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఆహా కు చేసిన ఈ కథలు తెలుగు దర్శకులలో కొత్త ఆలోచనలు పుట్టించవచ్చు.