దేవరకొండ తమ్ముడి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’

6
middle class melodies
middle class melodies

middle class melodies

అతి తక్కువ టైమ్ లోనే హీరోగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న విజయ్.. రీసెంట్ గా తన తమ్ముడు ఆనంద్ ను కూడా హీరోగా పరిచయం చేశాడు. పూర్తిగా బయటి బ్యానర్ లోనే ఆనంద్ హీరోగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా వచ్చిన దొరసాని సినిమా విమర్శకులను విపరీతంగా మెప్పించింది. కెవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అయిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఆ కంటెంట్ కు సరిపోయేలా ఆనంద్ నటన కూడా ఓకే అనిపించింది. అయితే రెగ్యులర్ హీరోగా నిలబడతాడా అనే అనుమానాలూ వ్యక్తం చేశారు చాలామంది. అలాంటి వారికి ఆన్సర్ చెప్పేందుకు ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్ తో రెడీగా ఉన్న ఆనంద్ దేవరకొండ హీరోగా లేటెస్ట్ గా మరో సినిమా అనౌన్స్ అయింది.

శౌర్యం, లౌక్యం, సౌఖ్యం, పైసా వసూల్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించిన భవ్య  క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ టైటిల్ తో సహా వచ్చేయడం వచ్చేయడం విశేషం. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ చిత్రంలో 96, జాను చిత్రాల ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. వినోద్ అంతోజు ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతుండగా.. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు సంగీతం అందించిన స్వీకార్ అగస్త్య ఈ మూవీకి మెలోడీస్ ను ఇవ్వబోతున్నాడు. ఇక భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించబోతోన్న ఈ మూవీ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. మొత్తంగా ఆనంద్ దేవరకొండకు ఈ ప్రాజెక్ట్ కీలకం అనే చెప్పాలి.

tollywood news