ఓ సిద్ధాంతి తోటలో అర్దరాత్రి పూజలు

Spread the love

Midnight Secret Pooja In Astrologer House

ఎక్కడైనా అర్దరాత్రి రహస్యంగా పూజలు చేస్తే సహజంగా అయితే అవి క్షుద్రపూజలనే అనుకుంటారు. అదే విధంగా ఓ గ్రామంలో కూడా గ్రామస్థులు కూడా అనుకున్నారు కానీ చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు . అవి క్షుద్ర పూజలు కాదని తెలుసుకున్నారు .
ఇంతకి అసలు మ్యాటర్ ఏంటంటే ..అమలాపురం పట్టణానికి చెందిన ఆలయ పూజారి రాంపల్లి శేషసాయి కుమారుడు శివదుర్గాప్రసాద్‌కు వివాహం కావడంలేదు. దీనితో ఆయన పలువురు సిద్ధాంతులును కలిసారు . అందులో భాగంగా జిలగం వీరముక్తిలింగేశ్వరరావు అనే సిద్దాంతి కాలసర్ప దోషంతో తన బిడ్డకు వివాహం ఆలస్యమవుతోందని అరటి చెట్టుతో మీ బిడ్డకు ముందుగా వివాహం జరిపిస్తే కల్యాణం జరుగుతుందని చెప్పారు. దాంతో సిద్ధాంతికి చెందిన తోటలోనే ఈ వివాహ తంతు బుధవారం రాత్రి చేపట్టారు. అరటితోటలో శబ్ధాలు రావడంతో గ్రామస్థులు వారిని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు . దీనిపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *