ప్రియాంకా హత్యపై మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు

minister controversial comments on priyanka reddy

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్యోదంతం అంశానికి సంబంధించి హోం మంత్రి మహమూద్‌ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్‌ చేయడానికి బదులు డయల్ 100 నంబరుకు కాల్‌ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రియాంకా రెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం (నవంబర్ 29) సాయంత్రం హోం మంత్రి మహమూద్ అలీ, సీపీ సజ్జనార్ పరామర్శించారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా రెడ్డికి జరిగిన అన్యాయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘షాద్‌నగర్‌లో జరిగిన ఘటన విచారకరం. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో కూడా చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం.

ప్రియాంక కేసును కూడా పోలీసులు స్వల్పకాలంలో ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు’ అని మహమూద్ అలీ చెప్పారు. ‘హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే.. ఉన్నత విద్యనభ్యసించి కూడా ప్రియాంక రెడ్డి ఇలాంటి పొరపాటు చేయడం ఆలోచించాల్సిన విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్‌ చేసే బదులు డయల్ 100కి ఫోన్‌ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేది’ అని మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ‘ఇంటికో పోలీసును పెట్టలేం కదా..’ అని తలసాని వ్యాఖ్యానించారు. ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై మంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సందర్భంలో పోలీసు వ్యవస్థ గురించి వివరిస్తూ తలసాని  ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తలసాని వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు మంత్రుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఇంతా జరుగుతున్నా, మహిళలకు రక్షణ కరువు అవుతున్నా మంత్రులు ఇలా అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం సరి కాదని  ఫైర్ అవుతున్నారు. ప్రజల నుండి కూడా మంత్రుల వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

minister controversial comments on priyanka reddy,Priyanka Reddy, Hyderabad, shadnagar, shadnagar hyderabad, Telangana, veterinary doctor, Shadnagar police station,mahmood ali, talasani srinivas yadav, telangana ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *