హరీశ్ రావుదే భారం

7
Minister Harish Rao campain In dubbaka
Minister Harish Rao campain In dubbaka

Minister Harish Rao campain In dubbaka

సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములపై కాకుండా, టీఆర్ఎస్ మెజార్టీపై ఫోకస్ చేయనుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత సూచించగానే రంగంలోకి దిగారు హరీశ్ రావు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను పర్యటించారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహంచి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించి అధినేతకు బహుమతిగా ఇవ్వాలని క్యాడర్‌కు పిలుపు నిచ్చారు.

ఏ ఎన్నిక జరిగినా భారమంతా హరీశ్ రావుపైనే పడుతోంది. ఈ సారి కూడా హరీశ్ రావు అన్ని తానై వ్యవహరించనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా 37,925,  62,500 మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా హరీశ్ రావు పావులు కదుపుతున్నట్లు, టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తేనే మరిన్ని పథకాలు తీసుకొస్తానని కింది స్థాయిలో నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. మరి హరీశ్ రావు టార్గెట్ చేరుకుంటాడనేది త్వరలో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here