ప్రోటోకాల్ తెలియదా… కిషన్ రెడ్డి సీరియస్

Minister kishan reddy fires on metro officials

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది . దాంతో మెట్రో అధికారులపై మండిపడుతున్న కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.ఇక అసలు విషయం ఏమిటంటే కేంద్రంలో హోం శాఖ  సహాయ మంత్రిగా పని చేస్తున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎంపీని, రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిని అయిన తనకు మెట్రోరైలు ప్రారంభోత్సవానికి తగిన రీతిలో ఆహ్వానం పంపకపోవడమేంటన్నది ఇపుడు కిషన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది.

ఇటీవల మూడు రూట్లలో నిర్మాణమైన హైదరాబాద్ మెట్రోలో ఇటీవల మూడో మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభింపజేసిన సంగతి తెలిసిందే. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య నడిచే ఈ మెట్రో మూడో మార్గాన్ని ప్రారంభించిన మర్నాటి నుంచే ఈ మెట్రో రూటు అందుబాటులోకి వచ్చేసింది. ఇదంతా బాగానే వున్నా.. ఈ మెట్రో రూటు ఆల్ మోస్ట్ 90 శాతం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే వుంది. ప్రారంభ కార్యక్రమం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే నిర్వహించారు. ఇక ఆ ప్రారంభ కార్యకరమానికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందాల్సి ఉంది. జేబీస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ఓపెనింగ్ ప్రోగ్రామ్‌కు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా స్థానికంగా వుంటారు. ఆయనకు కూడా పిలుపు ప్రాపర్‌గా వెళ్ళలేదని తెలుస్తోంది. ఒకవైపు పార్లమెంట్ నడుస్తుంటే ఇంకోవైపు ప్రారంభ కార్యక్రమాన్ని ఎలా పెట్టుకుంటారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.మెట్రో అధికారులపై తీవ్ర ఆగ్రహంతో వున్న కిషన్ రెడ్డి సహా కేంద్ర మంత్రులు శనివారం మెట్రో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు.

Minister kishan reddy fires on metro officials,hyderabad metro, kishan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *