పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్

Minister Ktr visit rain effect ares

పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు వర్ష ప్రభావిత కాలనీల్లో పర్యటిస్తున్నారు. మూడోరోజు తన పర్యటనలో భాగంగా ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాల పైన ఆరా తీశారు. ప్రభుత్వం అవసరమైన వారందరికీ రేషన్ కిట్ లతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను అందిస్తుందన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీలు వరద నుంచి తెరుకుంటున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

వరద ప్రభావిత కాలనీ లలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు. ప్రజలంతా తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, కాచిన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *