#Miss teen Universe Title winner Telugu girl#
తొలిసారి నిర్వహించిన ‘మిస్ టీన్ తెలుగు యూనివర్స్’ అందాల పోటీల్లో ఓ తెలుగు అమ్మాయి విజేతగా నిలిచారు. అమెరికాలో స్థిరపడిన 15 ఏళ్ల తెలుగమ్మాయి నిత్యా కొడాలి అరుదైన ఘనత సాధించారు. భారత్ సహా 40 దేశాల నుంచి 18,000 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా, మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గ్రాండ్ ఫైనల్‌కు 22 మంది ఎంపికయ్యారు.
పోటీల్లో తెలుగు ఉచ్ఛారణ, రాంప్ వాక్, టాలెంట్, ప్రశ్నలు- సమాధానాలు ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. దీంతో నిత్యా కొడాలి విజేతగా నిలిస్తే… మొదటి రన్నరప్‌గా సాత్విక మోవ్వా, సెకండ్ రన్నరప్‌గా సుష్మితా కొల్లోజు నిలిచారు. కాగా, ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ… విజేతగా నిలిచిన నిత్యకు కీరిటాన్ని ధరింపజేశారు. ఈ సందర్భంగా నిత్య మాట్లాడుతూ విజయం చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చిందన్నారు.