ఇంటర్ ఫలితాల అవకతవకలతో బయటపడుతున్న గ్లోబరీనా మోసాలు

Mistakes in Inter Paper evaluations

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. ఇక గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటి సొల్యూషన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

2017లో కాకినాడ జేఎన్టీయూలో గ్లోబరినా మోసాలు బయటపడ్డాయి. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్ ఈ కంటెంట్ టెండర్లలో మోసాలకు పాల్పడినట్లు గ్లోబరీనాపై ఆరోపణలు వచ్చాయి. కాకినాడ జేఎన్టీయూలో 36 కోట్ల ఒప్పందం ద్వారా టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా 26 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్లోబరీనా మోసాలపై కాకినాడ సర్పవరం పీఎస్ ల లో జె.ఎన్.టి.యు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. గ్లోబరీనా మోసాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *