సైకో ఎస్సై అంటూ రాపాక సంచలన ఆరోపణలు

Spread the love

MLA RAPAKA SENSATIONAL ALLEGATIONS ON SI

జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం  ఎస్సై పై సంచలన ఆరోపణలు చేశారు.  పోలీస్ శాఖలో ఇలాంటి ఎస్సైలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.  తనపై కేసు నమోదు చేసిన పరిస్థితుల్లో వెల్లడించిన తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్న కారణంగానే తాను సరెండర్ అయినట్లుగా పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి  తాము చేసింది కాదని కొన్ని అరాచక శక్తులు కావాలని చేసినటువంటి దాడి అని ఆయన పేర్కొన్నారు.
స్టేషన్ బెయిల్ పై  బయటకు వచ్చిన  రాపాక వరప్రసాద్ కూడా మీడియాకు చెప్పారు.  కనీసం ఎమ్మెల్యే నన్న గౌరవం కూడా లేకుండా మలికిపురం ఎస్ఐ  దుర్భాషలాడారని ఆయన పేర్కొన్నారు.  ఎమ్మెల్యే అయితే ఏం పీకుతాడు..  ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యే..   పాయింట్ బ్లాంక్ లో పెట్టి  షూట్ చేసి పారేస్తాం అని స్టేషన్లో వీరంగం  వేశారని,  ఆ సమయంలో అక్కడ దాదాపు 50 మంది  ఉన్నారని  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు.  అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో  ఎస్ఐ ని ప్రశ్నించడానికి  పోలీస్ స్టేషన్ కి వెళ్లామని  దీనిని మరింత వివాదాస్పదం చేయాలని ఎవరో అరాచక శక్తులు పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం చేశారని,  దీంతో తమ పార్టీ నేతలకు కానీ కార్యకర్తల గాని ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సదరు ఎస్సై పై సంచలన ఆరోపణలు చేశారు రాపాక వరప్రసాద్. లా అండ్ ఆర్డర్ కు పనికి రాని ఎస్ఐని  మలికిపురం పోలీస్ స్టేషన్ కు పంపించారని,  పోలీస్ స్టేషన్ కు ఎవరు వచ్చినా సరే  ఎస్సై బూతు పంచాంగం వినలేక పోతున్నారని,  ఒక సైకో లాగా ఎస్సై ప్రవర్తిస్తున్నాడని  ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు.  ప్రస్తుతం మలికిపురం ఎస్ఐ  రాజోలు  ట్రైనీ ఎస్సైగా  ఉన్న సమయంలో  ఒక అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని,  అప్పుడు స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల ఒక ఎస్ టి అమ్మాయి  తనను ప్రేమించి గర్భవతిని చేసి మోసం చేశాడంటూ  పెళ్లి  చేసుకోను అంటున్నాడంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అతను  చేసుకోకపోతే నేను చేసుకుంటాలే అని చాలా నీచంగా మాట్లాడాడు అని ఆరోపణలు గుప్పించారు.  ఇలాంటి ఎస్ఐ పోలీస్ శాఖ లో ఉంటే పోలీస్ శాఖ పరువు పోతుందని,  ఇతని విషయంలో పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.

JANASENA MLA CONTROVERSY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *