ఏ మొహం పెట్టుకొని అమరావతి కి వెళ్లారు…

MLA Roja Slams CM Chandrababu

వైసిపి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారుబాతు అమరావతి గొంతును వైసీపీ కోసేసిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరచుగా చేసే వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు చెప్పినట్టు అమరావతి బంగారు బాతు కాదని, చంద్రబాబు గారి అవినీతి బంగారు బాతు అని, ఇక దాని గొంతు కోశారే తప్ప మరొకటి కాదు అని రోజా పేర్కొన్నారు. తన కుల పెద్దలు, బినామీలతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, దానికి చక్రవర్తిలా వుండాలనుకున్న చంద్రబాబుకు సీఎం జగన్ బుద్ధి వచ్చేలా చేశారని రోజా ఘాటుగా విమర్శించారు.

చంద్రబాబు హయాంలో రైతుల నుంచి ముప్పై వేల ఎకరాలకు పైగా తీసుకున్నారే తప్ప వారికి కౌలు ఇవ్వలేదని, వారికి ఇస్తామన్న ప్లాట్లనూ డెవలప్ చేయలేదని, రైతులు మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బాబు అమరావతిలో పర్యటిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తాడికొండ, మంగళగిరిలో చిత్తుగా టీడీపీ ఓడిపోయిదంటే దాని అర్థమేంటి? అమరావతిలో చంద్రబాబు ఏం చేయలేదనే కదా? అన్నారు రోజా. తాత్కాలిక భవనాల కోసం చదరపు అడుగుకే పది వేల రూపాయల చొప్పున మింగేసిన చంద్రబాబు, తన ఐదేళ్ల పాలనలో కనీసం ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ కట్టాడా? అని ప్రశ్నించారు. జగన్ పై బురదజల్లడమే ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాదని రోజా పేర్కొన్నారు.

జెట్ స్పీడ్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్న జగన్ కు ప్రజలు జేజేలు పలుకుతున్నారని రోజా పేర్కొన్నారు. జగన్ పై నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తే పుట్టగతులుండవని రోజా తిట్టిపోశారు. చంద్రబాబు గతంలో తన పాలనలో అమరావతిలో నిర్మాణాలకు చేసిన శంకుస్థాపనల్లో ఏ ఒక్క బిల్డింగూ పూర్తి కాలేదని విమర్శించారు.అమరావతిలో కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబునాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లారని ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ నేత రోజా అన్నారు. ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంశాలపై చంద్రబాబు తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారని, దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడేమో అమరావతి పర్యటనకు వెళ్లారని విమర్శించారు. అమరావతి పర్యటనలో చంద్రబాబుకు రైతులు తగిన గుణపాఠం చెప్పారని రోజా పేర్కొన్నారు.

MLA Roja Slams CM Chandrababu,chandrababu, roja, apiic chairman, nagari mla, capital amaravati visit, ys jagan mohan reddy, ycp, tdp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *