బీజేపీ ఎంపీతో కలిసి పని చేస్తానన్న షకీల్

MLA SHAKIL LATEST COMMENTS ON PARTY CHANGE

టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపేందుకు పార్టీలోని కొందరు కాచుకుని ఉన్నారంటూ ఆరోపించారు. తాను వెళ్లాలనుకుంటే ధైర్యంగా రాజీనామా చేసి వెళ్తానని షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిస్తే తప్పేంటని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను కలిస్తే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో తాను బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్లు గుర్తు చేశారు. పార్టీ మారాలనే ఆలోచన తనకు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ధర్మపురి అరవింద్ కుటుంబానికి తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

మళ్లీ కలుస్తా.. తప్పేంటి?
సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ సైతం తమ ఇంటికి వస్తూ ఉంటారని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఊహాగానాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యే కోరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ జిల్లా అభివృద్దికి ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి పని చేస్తానని ఆయన చెప్పారు.అవసరమైతే మళ్ళీ మళ్లీ కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.మర్యాదపూర్వకంగానే తాను షకీల్‌ను కలిసినట్టుగా ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో ఓ పధకం ప్రారంభోత్సవం కోసం  నిజామాబాద్ ఎంపీ  అరవింద్ ను ఆహ్వానించినట్టుగా ఆయన తెలిపారు.టీఆర్ఎస్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు. పదవులు కావాలని అడగడం తప్పు లేదన్నారు.  సామాన్య కార్యకర్తను కూడ ఎంపీగా ఎన్నిక చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని ఆయన చెప్పారు.కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. తాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మంత్రి పదవి ఇవ్వాలని తాను కేసీఆర్‌ను అడగలేదన్నారు. భవిష్యత్తులో తనకు అవకాశమిస్తారని తాను ఆశిస్తున్నట్టుగా చెప్పారు.
టీఆర్ఎస్ అందరిది… ఇది ఏ ఒక్కరిది కాదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లోని ప్రతి ఒక్క కార్యకర్త కూడ టీఆర్ఎస్‌కు ఓనర్లని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అందరిదని ఆయన చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు తనకు పదవిని సీఎం కేసీఆర్ అవకాశాలను కల్పిస్తారని షకీల్ వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడే అవకాశం లేదన్నారు.

SHAKEEL LATEST COMMENTS

tags : trs, nizamabad, kcr, bodhan mla , shakeel, mp aravind, bjp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *