ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

MLC ELECTION SCHEDULE

  • రెండు రాష్ట్రాల్లో 10 స్థానాలకు మార్చి 12న పోలింగ్
  • అదేరోజు ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు రాష్ట్రాల శాశనమండళ్లలో ఐదేసి స్థానాల చొప్పున ఖాళీ అవుతున్నాయి. ఏపీ మండలి నుంచి పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు.. తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీమ్‌, మహమూద్ అలీ పదవీకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలను భర్తీ చేయడం కోసం ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 1వ తేదీ నుంచి వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 5 వరకు గడువు విధించారు. మార్చి 12న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *