ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

4
TELANGANA MLC ELECTIONS 2021
TELANGANA MLC ELECTIONS 2021

MLC ELECTIONS PEACEFUL

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం: సీఈఓ శశాంక్  గోయల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రం లోని 140 పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన వికలంగురాలు ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. అలాగే  పోలింగ్ ఏజెంట్ లతో మాట్లాడి ఓటరు గుర్తింపు లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నయా అని అడిగి తెలుసుకున్నారు. పలువురు ఓటరులతో ఆయన మాట్లాడారు. ఎన్నిక నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని వారు సిబ్బందికి సూచించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని అన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడనికి ఉత్సాహంగా వస్తున్నారన్నారు. సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ కేంద్రం లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగా  ఓటు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ హరిత, ఆర్డీఓ మహేందర్ జీ, డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్రీనివాస్,  తహశీల్దార్ రియాజుద్దీన్, సీఐ రమేష్ కుమార్, ఎస్సై భాస్కర్ రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ వెంకటేశ్వర్ రావు, తదితరులు ఉన్నారు.

 

TELANGANA MLC ELECTIONS 2021