యాదాద్రి ‘ఎంఎంటీఎస్’ పట్టాలెక్కెదెప్పుడో..!

MMTS to Yadadri may its dream

యాదాద్రిని… తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం మాదిరిగా రాష్ర్ట ప్రభుత్వం తీర్చిదిద్దాలని సంకల్పించింది. అందుకు తగ్గట్టుగానే యాదాద్రి పనులు, ఆలయ నిర్మాణం, గర్భగడి పనులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీస్ ను నడిపించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను నడిపించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలంటూ సీఎం కేసీఆర్‌ చేసిన విన్నపానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం… రాయగిరి స్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తున్నట్టు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ప్రకటించింది. దీని కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తొలుత అంచనాలు కూడా వేశారు. ఏళ్లు గడుస్తున్నా మూడో దశ ప్రక్రియ ప్రారంభమవుతుందా? అనేది సందిగ్ధంలో ఉంది. ఈ మార్గం లో రైళ్లు పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ కల కాగితాలకే పరిమితమైంది. ఆ కల ఎప్పుడు నెరవేరుతుందోనని వేచి చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *