ఆస్పతుల్లో ఆధునిక పరికరాలు

3
Modern Equipment In Covid Hospital 
Modern Equipment In Covid Hospital 

Modern Equipment In Covid Hospital

రాష్ట్రంలో కరోనా కేసు నమోదు అయిన రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం కరోనా పై యుద్ధం ప్రకటించింది. కరోనా వారియర్స్ గా వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్న ప్రతి ఉద్యోగి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో చాలామందికి వైరస్ సోకి క్వారంటెన్ లో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. వైరస్ ఉదృతి పెరిగిన నేపథ్యంలో హాస్పిటల్స్ శుభ్రం చేయడానికి చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అత్యాధునిక యంత్ర పరికరాలను పెద్ద ఎత్తుగా వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అతి త్వరలోనే కోవిడ్ ఆస్పత్రిలు అన్నిటిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫ్లోర్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, బాత్రూం క్లీనింగ్ కోసం పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, వాటిని కొనుగోలు చేసి అన్ని కోవిడ్ ఆసుపత్రులకు అందజేస్తాము అని చెప్పారు. ICU లో కూడా వీటినే వినియోగిస్తామని తెలిపారు. 10 మంది మనుషులు చేసే పనిని ఒక మిషన్ ద్వారా చేయవచ్చు. వేగవంతంగా, ఎక్కువ నాణ్యతతో పని చేయగల సామర్థ్యం ఉన్న మిషనరీ నీ తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పరికరాలు కేవలం నేలను శుభ్రం చేయడానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ గోడలని శుభ్రం చేసే మిషన్లు కూడా వచ్చాయి కాబట్టి వాటిని వినియోగించాలని కోరారు. ఆసుపత్రుల్లో ప్రధానంగా బాత్ రూం క్లీనింగ్ అనేది ప్రధాన సమస్య ఈ మిషన్లు ద్వారా దానికి కూడా పరిష్కారం లభించనుంది అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల వ్యర్ధాలను తరలించడం కోసం కూడా ప్రత్యేక యంత్రాలు అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో లో వాటిని కూడా కొనుగోలు చేయనున్నారు. కరోనా పేషంట్లు ఉన్న ఆసుపత్రిలో బయో మెడికల్ వేస్ట్ లో అతి ఎక్కువ వైరస్ ఉండే ఆస్కారం ఉండి కాబట్టి వ్యర్ధాలను తరలించడానికి మనుషులకంటే మిషన్లు ఉపయోగించడం శ్రేయస్కరం. కోవిడ్ పేషంట్ల కు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కానీ అవి పేషంట్ వరకు చేరే వరకు వేడిగా ఉండడం లేదు. దీని కోసం విమానాల్లో మాదిరిగా ఉండే హాట్ ప్యాక్ పరికరాలను వినియోగించాలని మంత్రి కోరారు. ప్రతి రోగికి వేడివేడిగా భోజనం అందేలా చూడాలని కోరారు. వ్యర్ధాలను తీసుకువెళ్లడానికి కూడా మనుషులకు బదులుగా యంత్ర సామగ్రిని వినియోగిస్తాం. ఆహార పదార్థాలను అందించేందుకు విమానాల్లో ఉండే హాట్ ప్యాక్ కెరియర్ను వినియోగించి వేడివేడిగా భోజనాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు.

Telangana Covid Latest News