మోడీ, మమత ఏం మాట్లాడుకున్నారు?

modi and mamata discussions

బుల్‌బుల్‌ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో మోదీ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బంగాళఖాతంలో ఏర్పడిన బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య ‘బుల్‌బుల్’ తుఫాన్ తీరం దాటింది. ఒడిషా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటలకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న “Bulbul” తీవ్రతుఫాను ఈశాన్య దిశగా ప్రయాణించి నవంబర్ 9 వ తేదీ రాత్రి 20.30 – 23.30 hrs మధ్య పశ్చిమ బెంగాల్ తీరం వద్ద సుందర్బన్ ఢాంచి అడవులకు దగ్గరలో తీరాన్ని దాటింది. తదుపరి ఇది ఈశాన్య దిశగా ప్రయాణించి ఈరోజు (నవంబర్ 10 వ తేదీ) తెల్లవారుజామున 02.30 గంటలకు కోస్తా పశ్చిమబెంగాల్ మరియు దానిని ఆనుకుని ఉన్న బంగాదేశ్ ప్రాంతాలలో Lat. 21.8 deg. N మరియు Long. 89.0 deg. E వద్ద సుందర్బన్ నేషనల్ పార్క్ (పశ్చిమ బెంగాల్)కు నైఋతి దిశగా 12 km, కోల్ కతా కు ఆగ్నేయ దిశగా 105 km, ఖేపుపర(బాంగ్లాదేశ్)కు పశ్చిమ నైఋతి దిశగా 125 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

bulbul cyclone updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *