సరోగసి బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Modi cabinet approves Surrogacy Bill

పిల్లలు లేక సతమతమవుతూ సరోగసీ ద్వారా తల్లులు కావాలనుకునే మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది . సరోగసీ  బిల్లు-2020 కి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ముఖ్యంగా వితంతువులకు, డైవోర్స్ తీసుకున్న మహిళలకు, బిడ్డల కోసం అల్లల్లాడే దంపతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.అనేకమంది సెలబ్రిటీలు కూడా పిల్లల కోసం సరోగసీ ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలోనే  రాజ్యసభ సెలెక్ట్ కమిటీ చేసిన కొన్ని సిఫారసులను ఈ బిల్లులో చేర్చినట్టు మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 23 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ 15 సూచనలు చేసిందని, వీటిలో ముఖ్యంగా వంధ్యత్వం (ఇన్ ఫర్టిలిటీ) అనే పదాన్ని తొలగించినట్టు ఆయన చెప్పారు. కమర్షియల్ సరోగసీని ఈ బిల్లు నిషేధించిందని ఆయన చెప్పారు. అటు-మన దేశంలో కేవలం భారతీయ జంటలు మాత్రమే ఈ కృత్రిమ గర్భ ధారణ ప్రక్రియను ఎంచుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.  సరోగేట్ మదర్ కి ఇన్సూరెన్సు వర్తింపు  గతంలో 16 నెలలు ఉండగా.. ఇక ఈ బిల్లు ప్రకారం దీన్ని 36  నెలలకు పెంచినట్టు ఆమె వెల్లడించారు.

Modi cabinet approves Surrogacy Bill,central government , surrogacy regulation bill, approved , minister prakash javadekar , smruthi irani , infertility , mother hood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *