ప్రధాని మోడీ ఫ్యూడల్

modi is feudalistic

ప్రధాని మోడీ ఫ్యూడల్ గా వ్యవరిస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు చేస్తున్నారని, నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఆయన్ని పార్లమెంట్ లో నిలదీస్తామన్నారు. బీజేపీ ఎంపీలు ముందు రాష్ట్రానికి తేవాల్సిన నిధుల గురించి ఆలోచించాలని, రాజకీయాలు కాదని హితువు పలికారు. ఎంపీ అయ్యి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదన తో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రజల ముందుకొచ్చారు. ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశమన్నారు. అది తనకు దక్కిన  అదృష్టమన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

*ఫెడరల్ టైప్ గవర్నమెంట్ కావాలని గుజరాత్ సీఎం, ఇప్పుడు ప్రధాన మంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. వైద్య, విద్య, ఉపాధి లేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారని నిలదీశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం లాక్ డౌన్ వాయిదా వేశారని తెలిపారు. అదే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదని వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..

‘‘కొవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు. హెలికాప్టర్ మనీ అని కేసీఆర్ చెప్తే చెయ్యలేదు. మోడీ ఇన్ని సార్లు విడియో కాన్ఫరెన్స్ పెట్టీ మాట్లాడుతున్నారు. కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు. FRBM లోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ను నిలదీస్తాం.

అరవింద్ ముందు రాష్ట్రం అభివృద్ది గురించి మాట్లాడు. రాష్ట్రానికి కేంద్రం నుండి తెచ్చే నిధులు గురించి కొట్లాడు.
ఒక సంవత్సరం నుండి ఇచ్చిన హామీలు ఎటు పోయాయి. ఒక్కటన్న నెరవేర్చారా?  కేంద్రం నుండి తీసుకువచ్చే నిధులు తీసుకురండి. అవి పక్కన పెట్టీ అభివృద్ది చేస్తున్న రాష్ట్రం మీద విమర్శలు చేయడం తగునా?  అభివృద్ది అందుబాటు అనే నినాదం తో ప్రజల ముందుకు వచ్చాను. అదే కొనసాగిస్తున్నాను. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి., నియోజక వర్గ ఎమ్మెల్యేలు అందరూ పూర్తి స్థాయిలో సహకరించారు. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో రాష్ట్ర అభివృద్ది కోసం పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ నీ వినిపిస్తున్న. కెసిఆర్ ప్రగతి నివేదన సభ పెట్టీ ప్రభుత్వం చేసిన పని చెప్పారు. అదే విధంగా ఈ సంవత్సరం పాటు ఎం చేశామో ప్రజల ముందుంచుతున్నాను. జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ లోకి సీఎం మార్చారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తీ చేస్తాం. ఎంఎంటీఎస్ ను వికారాబాద్ కు ఎక్స్టెన్షన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఫార్మా సిటీ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాను. ఐటీ విస్తృతికి కృషి చేస్తున్నాం. అమెజాన్ డాటా సెంటర్ ను తీసుకొని వచ్చాం. కేటీఆర్  ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యం గా పని చేస్తున్నాం. నా తపన, ఆరాటం చేవెళ్ల నియోజక అభివృద్ది.  చేయాల్సింది చాలా ఉంది. బిజినెస్ కంటే ప్రజాసేవలో సంతోషం ఎక్కువ ఉంది.’’

#ModiLatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *