మత మార్పిడులపై కేంద్రం బిల్లు?

modi latest decision on religious conversions

మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలతో చట్టాలను రూపొందిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తలాఖ్ బిల్లు, ఆర్టికల్ 370 వంటి సంచలన బిల్లులకు ఆమోదం తెలిపిన మోడీ ప్రభుత్వం.. ఈ క్రమంలోనే మరో సంచలన బిల్లును ఆమోదించేందుకు సిద్ధం అవుతుంది. మత మార్పిడులను నిరోధించేందుకు సంచలన బిల్లును తీసుకుని రావాలని కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లు రూపొందించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. బిల్లులో ఎటువంటి నిబంధనలు ఉండాలి.

ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లులను ఆమోదం పొందేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు చేసిన తీరును తప్పుపట్టిన ప్రతిపక్షాలు.. ట్రిపుల్ తలాక్‌ బిల్లుపైన కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ట్రిపుల్ తలాక్ కారణంగా భర్తను జైలుకు పంపించే నిబంధనపై ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని బిల్లులను ఆమోదం పొందేలా చేశాయి. ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

CENTRE CONTROVERSY DECISION?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *