తల్లి ఆశీర్వాదంతో ఓటేసిన మోడీ ,భార్యతో కలిసి ఓటేసిన అమిత్ షా

Spread the love

Modi voted with his mother blessing

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఏప్రిల్ 23,2019 న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పోలింగ్‌లో భారీ బందోబస్తు మద్య మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రనిప్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటేయడానికి ముందు ప్రధాని మోదీ గాంధీనగర్‌లో తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే గుజరాత్ సీఎం విజయ్ రూపాని భార్య అంజలి రాజ్ కోట్ లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో ఉదయం అమిత్ షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *