మోడీ పోటీ చేసేది అక్కడ నుండేనా ?

MODI Was Contesting  From ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించింది ఎన్నికల కమీషన్. దీంతో రాజకీయ పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నాయి. సీట్లు దక్కించుకున్న వారు ప్రచారంలో మునిగితేలుతున్నారు. కొందరు గెలుపోటములపై ఇప్పుడే బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా..? కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుందా..? లేక మూడో ఫ్రండ్ పీఠంపై కూర్చుంటుందా..? అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఎన్నికల విషయంలో ఎవరికి వారే తోచిన విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న ఉహాగానాలు చాలానే వస్తున్నాయి.
గత ఎన్నికల్లో సొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదరా – ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నుంచి మోడీ పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. కానీ వడదొర నుంచి వైదొలిగి వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ బరిలో నిలవడంతో ఈ ప్రాంతంలో కమలం వికసించినట్లయింది. అయితే ఈసారి మోదీ మళ్లీ వారణాసి నుంచేనా..? లేక ఇతర ప్రాంతం నుంచి పోటీ చేస్తారా..? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.కొన్ని రోజులుగా మోడీ ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన ఒడిశా అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ద వహించారు. అందులోనూ పూరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగించారు. దీంతో ఆయన పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని – ఇది ఒడిశా మొత్తం మోడీ ప్రభావం ఉంటుందని వార్తలు వచ్చాయి. అలాగే బెంగాల్ – మధ్యప్రదేశ్ లలోనూ పోటీ చేస్తారని అంటున్నారు. అయితే బీజేపీ నాయకులు ఇవన్నీ ఉహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే బీజేపీ ఎన్నికల సమావేశం ఉంటుందని అప్పుడే ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం మోడీ వారణాసి నుంచి పోటీలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మరో వారం రోజుల్లో మోడీ పోటీచేసే నియోజకవర్గం ఖాయం అవుతుందట. అప్పటివరకూ ఎదురు చూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *