బీజేపీలోకి మోత్కుపల్లి?

Spread the love

MOTHKUPALLY JOINS BJP

ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఏ పార్టీలో లేని నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు . కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆదివారం నాడు ఉదయం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు.వీరిద్దరు నేతలు సుమారు గంట సేపటికి పైగా భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు నర్సింహులు కూడ సానుకూలంగా స్పందించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆలేరు నుండి నర్సింహులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నుండి టీడీపీ అభ్యర్ధిగా నర్సింహులు పోటీ చేసి విజయం సాధించారు.2014 ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు కావాలని చంద్రబాబును కోరారు మోత్కుపల్లి నర్సింహులు. అయితే ఆ సమయంలో గరికపాటి మోహన్ రావుకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చారు. బీజేపీతో పొత్తు కారణంగా గవర్నర్ పదవిని కూడ ఇస్తామని చంద్రబాబు మోత్కుపల్లి నర్సింహులుకు హామీ ఇచ్చారు.అయితే గవర్నర్ పదవిని బీజేపీ నేతలు టీడీపీకి ఇవ్వలేదు. దీంతో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కలేదు. రాజ్యసభ సీటు రాలేదు. దీంతో ఆయన  అసంతృప్తికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బీజేపీకి జై కొట్టారు. ఈ నెల 18న ఆయన బీజేపీలో చేరనున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడ బీజేపీలో చేరనున్నారు.

tags : motkupalli narsimhulu , amith shah, bjp, defections, telangana,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *