కొవిడ్ వ్యాక్సిన్ కోసం సై..

9

MP KAVITA TOOK VACCINE

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి రాజకీయ నాయకులు క్యూ కట్టారు. హోలీ రోజున ఎంపీ జోగినిపల్లి సంతోష్, ఆయన సతీమణి రోహిణిలు కలిసి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. నిమ్స్ హాస్పిటల్ లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా విషయంలో అప్రమత్తత ముఖ్యమ‌ని క‌విత అన్నారు. సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు. అనవసరమైన పనులకోసం బయటకు రాకపోవడం ఉత్తమం అని తెలిపారు. ఆరోగ్య శాఖ సూచనల్ని తప్పనిసరిగా పాటించాల‌ని కోరారు.