పార్లమెంట్ గ్రీన్ ఛాలెంజ్

5
Green challenge by Mp Santosh kumar
Green challenge by Mp Santosh kumar

Mp Santosh Green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కు ఊహించని విధంగా రెస్సాన్స్ వస్తోంది. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా సినీ ప్రముఖులు, రాజకీయకులు, స్పోర్ట్స్ పర్సన్లు మొక్కలను నాటి ఇతరులకు ఆ చాలెంజ్ ను విసురుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన గ్రీన్ చాలెంజ్ దేశమంతటా విస్తరిస్తోంది. హైదరాబాద్ లో పేరొందిన  ఈ చాలెంజ్ పార్లమెంట్ ను కూడా తాకింది. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ ను మరింత అమలుపరుస్తూ గ్రీన్ ఇండియా దిశగా ముందుకెళ్తున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటు ఆవరణలో గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం అక్కడ రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు గ్రీన్‌ఛాలెంజ్‌ ఫౌండర్‌, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణం పట్ల ఉన్న అవగాహన అమోఘమని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తోందని ఆయన అన్నారు.