Akhil’S “MR.Majnu” Review
ప్లేబోయ్ క్యారెక్టర్ అటు నుండి ట్రు లవర్‌గా మారే కథలో ట్రాన్స్ఫర్మ్ కావడం అంటే ఓ నటుడికి చాలా కష్టమైన పనే. అలాంటి ప్రయత్నాన్ని తన మూడో చిత్రంలో చూపించాలనుకున్నాడు హీరో అఖిల్ అక్కినేని. తొలి రెండు చిత్రాలు ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో.. అఖిల్ సక్సెస్ కొట్టిన వెంకీ అట్లూరితోనే చేయికలిపాడు. మరి వెంకీ అట్లూరి అక్కినేని అభిమానిగా ప్రేమనగర్లో ఎ.ఎన్.ఆర్ పాత్రను ఆధారంగా చేసుకుని రాసుకున్న పాత్రతో మిస్టర్ మజ్నుని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధిఅగర్వాల్, జయప్రకాశ్, రావు రమేష్, నాగబాబు, విద్యుల్లేఖారామన్, ప్రియదర్శి, హైపర్ అది, అజయ్, సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
కథ:
విక్రమ్ కృష్ణ(అఖిల్) ప్లేబోయ్. లండన్‌లో ఎమ్మెస్సీ చదువు పూర్తి చేసే పనిలో ఉంటాడు. అమ్మాయిలను పడేసే పనిలో తను ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అమ్మాయిలు కూడా అతన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. లండన్‌లో తన బాబాయ్ ఇంట్లో ఉంటూ చదువుకునే నిక్కి(నిధి అగర్వాల్) కూడా విక్కి గురించి తెలుసుకుని అతనంటే అసహ్యం పెంచుకుంటుంది. అయితే విక్కి బాబాయ్ కుమార్తె ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అని.. నిక్కి తనకు చుట్టాలమ్మాయి అని విక్కికి తర్వా తెలుస్తుంది. అయితే తర్వాత జరిగే పరిణామాలతో విక్కి కేవలం ప్లేబోయ్ మాత్రమే కాదు.. జెంటిల్‌మేన్ అని తెలుసుకుంటుంది. అతనితో ప్రేమలో పడుతుంది. ఆ విషయాన్ని విక్కితో చెబితే ప్రేమించాడనికి ఒప్పుకోడు. అదే సమయంలో రెండు నెలలు ఇద్దరం ప్రేమించుకుందామని.. ఆ ప్రయాణంలో మనస్తత్వాలు కలవకపోతే విడిపోతామని నిక్కి అంటుంది. దానికి విక్కి సరేనంటాడు. అయితే నిక్కి .. విక్కిపై చూపించే ప్రేమ, కేర్‌ను అతను తప్పుగా అర్థం చేసుకుని బాధపడతాడు. దాంతో విక్కిని వదిలేసి నిక్కి లండన్ వెళ్లిపోతుంది. అయితే తర్వాత నిక్కిపై తనకు ప్రేమ ఉందని అర్థం చేసుకున్న విక్కి ఆమె కోసం లండన్ వెళతాడు. అక్కడకు వెళ్లి ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు? అనేదే ప్రధాన కథాంశం. అదెలాగో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్:
– అఖిల్ నటన
– సినిమాటోగ్రఫీ
– నిర్మాణ విలువలు
– ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్:
– రొటీన్ కథ
– సినిమా స్లోగా అనిపించడం
– సెకండాఫ్
సమీక్ష:
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ .. ఈసారి పూర్తిగా ప్లేబోయ్ క్యారెక్టర్లో మెప్పించే ప్రయత్నం చేశాడు. అఖిల్ లుక్ ఫ్రెష్‌గా అనిపించింది. పాత్ర కోసం 8 ప్యాక్ చేయడం విశేషం. అమ్మాయిలను అబద్దాలను పడేయడం .. దానికి అతను చెప్పే కారణాలు.. అక్కడ నుండి ఇండియా వచ్చినప్పుడు అక్కడ హీరోయిన్ తన చెల్లెలకు ఆడబిడ్డ వరుస అవుతుందని తెలుసుకుని .. ఆమెతో మంచి ప్రవర్తించాలనుకోవడం.. కమ్రంగా కహీరోయిన్ అతనితో ప్రేమలో పడే సన్నివేశాలు.. ఎక్కడా బోర్ కొట్టవు. అలాగే హీరో అబద్ధం చెప్పినప్పుడల్లా అతని స్నేహితుడైన ప్రియదర్శికి దెబ్బలు తగలడం.. అలాగే బాబాయ్‌కి కష్టం వచ్చినప్పుడు హీరో అండగా నిలబడే ఎమోషనల్ సన్నివేశాలు అన్ని కనెక్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌లో నెక్ట్స్ ఏం జరగబోతుందనే విషయంలో కొత్తదనం ఏమీ కనపడదు. అక్కడ నుండి కథ రొటీన్‌గా సాగుతుంటుంది. ఇక సెకండాఫ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. హీరో, హీరోయిన్ను తన ప్రేమలో నిజాయతీని ఒప్పించే క్రమం అంతా చూపిస్తారు. ముఖ్యంగా హైపర్ అది కామెడీ ట్రాక్ లేకపోతే సినిమా సెకండాఫ్ వాష్ అవుటే. తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఇక సినిమా స్లో ఫేజ్‌లో ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం పరంగా సినిమాను తెరకెక్కించడంలో ఓకే అనిపించినా కథను ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ కాలేకపోయాడు.
బోటమ్ లైన్:
మిస్టర్ మజ్ను… రొటీన్ లవ్‌స్టోరీ
రేటింగ్: 2.5/5