‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్

Mr Majnu Pre Release Event
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. చిత్రంలోని అన్ని పాటలకు శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.  కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 19న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *