అవినీతి తిమింగిలం లావణ్య అరెస్ట్

Spread the love

MRO LAVAYNA ARREST

అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగా రెడ్డి జిల్లా కేశంపేట మండలం తాహిశీల్దార్ లావణ్యను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు బయటపడడంతో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. కాసేపట్లో ఆమెను హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.లావణ్య అరెస్టుతో ఆమె భర్త వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు.వెంకటేష్ కూడా ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. భార్య ఎసిబికి పట్టుబడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వీఆర్వో అనంతయ్య ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో లావణ్య అక్రమాలు వెలుగు చూశాయి. లావణ్య నివాసం నుంచి ఎసిబి అధికారులు 93 లక్షల రూపాయల నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తీగలాగితే డొంక అంతా కదిలినట్లు…. ఓ వీఆర్వో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే… అతని ద్వారా ఈ అవినీతి తహశీల్దార్ బండారం బయటపడింది. తహశీల్దార్ ఇంట్లో అవినీతి శాఖ అధికారులు సోదాలు చేపట్టగా… రూ.93లక్షల నగదు బయటపడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది.అనుమానం వచ్చిన అధికారులు సోదాలు చేయగా… ఇంట్లో ఎక్కడ చూసినా నగదు కట్టలే. ఆమె ఇంట్లో రూ.93లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు నిర్వహించిన సోదాల్లో రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

LATEST POLITICAL NEWS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *