మహేంద్రుడి కెరీర్ కు 15 ఏళ్ళు

MS Dhoni completes 15 years in international cricket

MS Dhoni

మహేంద్రసింగ్ ధోని…క్రికెట్ అభిమానులకు ఆరాధ్య క్రికెట్ ప్లేయర్. టీం కష్టాల్లో ఉన్నప్పుడు మహేంద్రుడు ఉన్నాడు లే అన్న ధీమా. మైదానంలో క్లిష్టపరిస్థితుల్లో కూడా మిస్టర్ కూల్ గా వ్యవహరిస్తాడు. కష్టకాలంలో బౌలర్లకు సూచనలిస్తూ విజయానికి కారకుడవుతాడు. ఇక అయన కీపింగ్ కూడా స్పూర్థిగానే ఉంటుంది. బ్యాట్సమెన్ వదిలిన బంతి మహేంద్రుడి చేతిలో పడిందంటే ఉడుం పట్టుని తలపిస్తుంది. ఇక హెల్మెట్ లేకుండా ఆడొచ్చని చాటి చెప్పిన విజన్ ఉన్న క్రికెటర్. #MS Dhoniఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మహేంద్రసింగ్ ధోని గురించి కథలు తయారవుతాయి. తన హెలికాప్టర్ షాట్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గబ్బర్. భారత్‌కు ఒక ప్రపంచకప్‌ను అందించిన జార్ఖండ్ డైనమేట్. అభిమానులందరూ ముద్దుగా ‘మహీ’ అని పిలుచుకునే ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆనాటి నుండి మహికి అన్ని బ్రహ్మండమైన విజయాలే.

MS Dhoni

ఇక ఎంఎస్ కెరీర్లో ఎక్కువగ వినిపించిన మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌ ధోని అనేది. అవును ఒక మ్యాచ్ చివరిదశలో ఉందంటే ఆ సమయంలో #ధోని ఉంటె కచ్చితంగా విజయమే అన్నరీతిలో ధోని మ్యాచ్ ని ఫినిష్ చెయ్యడం స్పెషాలిటీ. ఇక అయన కెరీర్ లో అత్యుత్తమ ఘట్టాలు గమనిస్తే… ధోని ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2011 లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ధోని హయాంలో  2011లో ప్రపంచ కప్ చేజిక్కుంచుకుంది భారత్. భారత్ ఈ కప్పు గెలవడంలో ధోని పాత్ర ఎంతో కీలకం. 2007లో మొదలైన ఐసీసీ వరల్డ్ టి20 కప్పును ధోని నాయకత్వంలోనే ఇండియా గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని నాయకత్వంలోనే భారత్ గెలుచుకుంది. 2010 మరయు 2016 ఆసియా కప్పులను కూడా ధోని తన నాయకత్వంలోనే భారత్ ఖాతాలో వేశాడు. ఇది ధోని ట్రాక్ రికార్డ్.

MS Dhoni

MS Dhoni completes 15 years in international cricket,Mahendra Singh Dhoni,captain Mahendra Singh, World Cup-winning captain,Dhoni Track Record,MS Dhoni Awards,Records,Achievements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *