డర్టీ హైదరాబాద్ – బురదే మిగిలింది

Mud effect on Hyderabad

భారీ వర్షాలు కురిసి నేటికి నాలుగు రోజులవుతుంది. అయినా హైదరాబాద్ తేరుకోలేదు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. కొన్ని చోట్లా వరద నీరు తగ్గినా బురదే మిగిలింది. దాదాపు 90కుపైగా కాలనీలు బురదలో ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఎటుచూసినా చెత్తాచెదారం.. బురద, అడుగు తీసి అడుగు వేయని వేయడం కష్టంగా ఉంది. సాధారణ పరిస్థితులు ఎప్పటికీ వస్తాయోనని నగర ప్రజలు బిక్కుబిక్కమంటు బతుకుతున్నారు. ఇంటి చుట్టూ బురద మేటలు వేయడంతో చాలామంది కాలనీవాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

అయితే ఇంకొన్ని కాలనీలకు, ఏరియాలకు కరెంట్ సప్లయ్ కూడా నిలిచిపోయింది. ఇప్పటివరకు 222 వీధులు అంధకారంలో ఉన్నాయి. సిటీ శివారులోని జల్ పల్లి, కొత్త చెరువు, పల్లె చెరువు నుంచి నీరు ఫ్లో అవుతూనే ఉంది. ఒకవైపు వరదనీరు, మరోవైపు బురద మేటలతో లోతట్టు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *