చతికిలపడ్డ చెన్నై

Spread the love

MUMABI 2ND WIN IN IPL

  • సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ గెలుపు

సమ ఉజ్జీల పోరులో చెన్నై చతికిలపడింది. వరుస విజయాలతో ఐపీఎల్ తో దూసుకుపోతున్న సూపర్ కింగ్స్ కు ముంబై చెక్ పెట్టింది. ముంబైలో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై పై ముంబై ఇండియన్స్37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్ లో ముంబైకి ఇది రెండో విజయం. హార్థిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో ముంబై విజయానికి బాటలు వేసింది. బ్యాటింగ్ లో 8 బంతుల్లో 25 పరుగులు చేసిన పాండ్యా.. బంతితోనూ చెలరేగి మూడు వికెట్టు పడగొట్టి చెన్నై వెన్ను విరిచాడు. తొలుత బ్యాటింగ్ కు చేసిన ముంబై ఇన్నింగ్స్ మొత్తం చాలా నెమ్మదిగానే సాగింది. 10 ఓవర్లలో మూడు వికెట్టు కోల్పోయి కేవలం 57 పరుగులు మాత్రమే చేసిన ముంబైని సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. టీ20 వంటి ఫార్మాట్ లో ఇది ఏమాత్రం సరిపోని స్కోర్.

అయితే, చివరి రెండు ఓవర్లు ముంబై గతిని మార్చేశాయి. హార్థిక్ పాండ్యా, పొలార్డ్ కలిసి ఆ రెండు ఓవర్లలో చిన్న సైజు సునామీనే సృష్టించారు. 19 ఓవర్లో 16 పరుగులు రాబట్టుకున్న ముంబై జట్టు.. ఇక చివరి ఓవర్లో అయితే ఏకంగా 29 పరుగులు పిండుకున్నారు. వెరసి చివరి 12 బంతుల్లో 45 పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వాస్తవానికి చివరి రెండు ఓవర్లే చెన్నై ఓటమిని నిర్దేశించాయి. 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. కేదార్‌ జాదవ్‌ (54 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే పోరాడాడు. రాయుడు డకౌట్ కాగా, వాట్సర్ (5) మరోసారి నిరాశపరిచాడు. క్రీజ్ లో కుదురుకుంటున్న సమయంలో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రైనా (16) ఇన్నింగ్స్ కు తెరపడింది. తర్వాత ధోని (12), జడేజా (1) కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో చెన్నై ఓటమి ఖాయమైపోయింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *