#Mumbai Enter into Play off#
ఒకవైపు పదునైన బౌలింగ్, మరోవైపు దుమ్ములేపే బ్యాటింగ్ ముంబై సొంతం. కీలక సమయంలో జట్టు ఏ ఒక్కరిపై ఆధారడపకుండా కలిసికట్టుగా శ్రమిస్తోంది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఇతర జట్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తోంది ముంబై. నిన్న జరిగిన బెంగళూరు మ్యాచ్ లో ముంబై మెరుగైన ప్రదర్శన చేసి ప్లేప్ ఆఫ్ బెర్త్ ను ఖారారు చేసుకుంది. లక్ష్యం చిన్నదే అయినా.. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో ముంబై శిబిరంలో కొంత ఆందోళన రేగింది. కానీ, కీలక మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తుదికంటా నిలిచి.. ముంబైని ఒంటి చేత్తో గెలిపించాడు. పడిక్కళ్ అర్ధ శతకంతో మెరిసినా.. బుమ్రా దెబ్బకు బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో మొత్తం 16 పాయింట్లతో ముంబై ప్లేఆఫ్స్ చేరుకుంది.
ఐపీఎల్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. దేవ్‌దత్ పడిక్కళ్ (45 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. సిరాజ్, చాహల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అన్ని జట్ల కంటే ముంబై ప్లే ఆఫ్ కు చేరుకుంది.