భారత్ పై దాడులకు జైషేను వాడుతున్నారు

Spread the love

MUSHARRAF ABOUT PAKISTAN

  • పాకిస్తాన్ నిజస్వరూపాన్ని వెల్లడించిన పర్వేజ్ ముషారఫ్

‘ఉగ్రవాదమా..? మా దేశంలోనా..? అబ్బే.. అలాంటిదేమీ లేదు. భారత్ చేస్తున్నదంతా అబద్ధపు ప్రచారం’ అంటూ అసత్యాలు వల్లెవేస్తున్న దాయాది పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బహిర్గతం చేశారు. పాకిస్తాన్ ముసుగు తీసేసి ప్రపంచానికి చూపించారు. భారత్ పై దాడులు చేయడానికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వినియోగిస్తోందని స్పష్టంచేశారు. పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ నదిమ్‌ మాలిక్‌కు టెలిఫోన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ కీలకమైన విషయాలు వెల్లడించారు. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ అయినప్పటికీ.. తన పాలన కాలంలో దానిని భారత్‌పై దాడుల కోసం ఇంటెలిజెన్స్‌ వాడుతుండేదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడుగా ఉన్న కాలంలో 2003లో జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించిదని ఆరోపించారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. అయితే మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నకు.. నాటి కాలంలో పరిస్థితులు చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. ఆ కాలంలో భారత్‌, పాక్‌లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని వెల్లడించారు.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *